టీడీపీ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తాం: నారా భువనేశ్వరి - క్యాంటీన్ ప్రారంభించిన భువనేశ్వరి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2024, 3:29 PM IST
Nara Bhuvaneshwari Started Anna Canteen In Mangalagiri: అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లను చంద్రబాబు పునరుద్ధరిస్తారని ఆయన సతీమణి భువనేశ్వరి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్న క్యాంటీన్లను నిలిపివేసినా రాష్ట్ర వ్యాప్తంగా 140కి పైగా క్యాంటీన్లను తెలుగుదేశం శ్రేణులు స్వచ్ఛందంగా నడుపుతున్నాయని భువనేశ్వరి తెలిపారు.
అన్నదానం మహాదానం అని అన్న ఎన్టీఆర్ స్పూర్తితో 2018లో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 300పైగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారని భువనేశ్వరి తెలిపారు. రోజుకు దాదాపు 3లక్షల మంది పేదల ఆకలిని అన్నా క్యాంటీన్లు తీర్చాయన్నారు. అన్న క్యాంటీన్లో ఏడు కోట్ల మందిపైగా భోజనం చేశారని భువనేశ్వరి పేర్కొన్నారు. 2019లో ప్రభుత్వం మారగానే వాటిని కక్ష పూరితంగా రద్దు చేశారని భువనేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే నిర్వహిస్తున్న 3 క్యాంటీన్లకు అదనంగా రేవేంద్రపాడులో మరో క్యాంటీన్‌ను భువనేశ్వరి ప్రారంభించి, స్వయంగా భోజనాల్ని వడ్డించారు. నిజం గెలవాలి పర్యటనలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో ఏడుగురు కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి ఈ రోజు పరామర్శించనున్నారు.