బాలకృష్ణ 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర'- కదిరి నుంచి ఎన్నికల ప్రచారం షురూ - Nandamuri Balakrishna - NANDAMURI BALAKRISHNA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 2:54 PM IST

Nandamuri Balakrishna Election Campaign in Satyasai District : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రచారం జోరును పెంచారు. ' స్వర్ణాంధ్ర సాకార యాత్ర ' పేరుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ యాత్రను సత్యసాయి జిల్లా కదిరి నుంచి ప్రారంభించారు. ఇవాళ హైదరాబాద్​ నుంచి హెలికాప్టర్​లో కదిరికి చేరుకున్నారు. అనంతరం శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. నందమూరి బాలకృష్ణకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

Balakrishna Visit to Kadiri Temple : బాలకృష్ణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామితో పాటు అమృతవల్లి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాన్ని ఆయనకు అందజేశారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ఎస్టీలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి కొత్త చెరువు ప్రధాన కూడలిలో బాలకృష్ణ రోడ్​ షో నిర్వహించారు. తమ అభిమాన నటుడు, నాయకుడ్ని చూడడానికి  ప్రజలు పెద్దలో అక్కడికి వచ్చారు. బాలకృష్ణతో ఫొటోలు దిగడానికి పోటీ పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.