నల్లమల అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు - 7 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించిన అగ్నికీలలు - Amrabad nallamala forest Fire
🎬 Watch Now: Feature Video
Published : Feb 1, 2024, 3:36 PM IST
Nallamala Forest Fire Incident : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దోమలపెంట రేంజ్ కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లె బైలు, నక్కర్ల పెంట ప్రాంతాల్లో సుమారు 7 హెక్టార్ల విస్తీర్ణంలో మంటలు వ్యాపించి, అడవి దగ్ధమైనట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వన్యప్రాణులకు ఎలాంటి నష్టం జరగకుండా, వీలైనంత త్వరగా మంటలు అదుపులోకి తెస్తామని తెలిపారు.
Fire in Amrabad Nallamala Forest : మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. అవసరమైతే మరో రెండు, మూడు ఫైర్ ఇంజిన్లను తెప్పించి మంటలను అదుపులోకి తెస్తామని అధికారులు తెలిపారు. గతంలో 2023లోనూ ఈ నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీని వల్ల 4,715 ఎకరాలు ప్రభావితం కాగా, 3,680 ఎకరాల నష్టం వాటిల్లిందని అప్పటి అటవీ శాఖ మంత్రి తెలిపారు.