LIVE: చంద్రబాబు విదేశీ పర్యటనపై సాక్షిలో వికృత రాతలు - నక్కా ఆనందబాబు మీడియా సమావేశం - Nakka Anandbabu on Sakshi News - NAKKA ANANDBABU ON SAKSHI NEWS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 4:06 PM IST

Updated : May 21, 2024, 4:16 PM IST

Nakka Anandbabu on Fake News in Sakshi About Chandrababu Tour Live : చంద్రబాబు విదేశీ పర్యటనపై సాక్షి వికృత రాతలు హేయమని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్టీఆర్ భవన్​లో మీడియా సమావేశం నిర్వహించారు. గత రెండు నెలలుగా రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారాలతో బిజీబిజీగా ఉన్నారు. ఈ వేసవి కాలంలో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో ఎన్నికల వేడి తారాస్థాయికి తీసుకెళ్లారు. క్షణం తీరికలేకుండా ప్రజలతో మమేకమయ్యారు. ఎట్టకేలకు ఈ నెల 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ ముగియడంతో కాస్త కుదుట పడ్డారు. అభ్యర్థులు భవిష్యత్తు జూన్ 4న తెలియనుంది. ప్రస్తుతానికి పోలింగ్ ముగియటంతో రాజకీయ విశ్రాంతి తీసుకుంటున్నారు. కౌటింగ్ వరకు సమయం ఉండటంతో వివిధ పార్టీల అగ్రనేతలు వారి కుటుంబ సభ్యులతో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టు అనుమతితో కుటుంబ సభ్యులతో లండన్ పర్యటనకు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి అమెరికాకు పయనమయ్యారు. దీనిపై సాక్షి రాతల గురించి నక్క ఆంద్​బాబు అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : May 21, 2024, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.