నాగానాగార్జునసాగర్ డ్యామ్​కు వరద ప్రవాహం - 18 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల - Nagarjuna Sagar 18 Gates open

By ETV Bharat Telangana Team

Published : Aug 12, 2024, 12:21 PM IST

thumbnail
నాగానాగార్జున సాగర్ జలాశయంకు కొసాగుతున్న వరద ప్రవాహం- 18 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల (ETV Bharat)

Nagarjuna Sagar Dam Water Flow 18 Gates Open: నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ నుంచి కాస్త వరద తగ్గుముఖం పట్టడంతో 18 క్రస్ట్ గేట్ల ద్వారా ప్రస్తుతం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  5 అడుగుల మేరకు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,43,532 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మరోవైపు సాగర్ కుడి, ఎడమ కాల్వలకు సాగు నీటి కోసం నీటిని తరలిస్తున్నారు. 

మొత్తం నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్​ఫ్లో  1,87,683క్యూసెక్కుల వస్తుండగా, అంతే మొత్తంలో ఔట్ ఫ్లో ఉంది. సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుతం 588.8 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308.46 టీఎంసీలుగా ఉంది. ఈ నెల 5 నుంచి సాగర్ జలాశయానికి  వరద ప్రవాహం ఎక్కువ కావడంతో  నీటి ప్రవాహాన్ని  బట్టి గేట్ల సంఖ్యను పెంచుతూ, తగ్గిస్తూ అధికారులు ఎప్పటికప్పుడు జాగ్రత్త వహిస్తూ నీటిని విడుదల చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.