నిండుకుండను తలపిస్తున్న నాగార్జునసాగర్ జలాశయం - 14 గేట్లు ఎత్తి నీటి విడుదల - Nagarjuna Sagar Project Gates Open
🎬 Watch Now: Feature Video
Published : Aug 28, 2024, 5:49 PM IST
Nagarjuna Sagar Project Gates Open : ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 14 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సాగర్‌కు 1 లక్షా 26 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.
శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జునసాగర్ 12 గేట్లు ఎత్తి 97 వేల 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. నాగార్జునసాగర్ ప్రస్తుత, పూర్తి నీటినిల్వ 312.50 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో ముందస్తుగా నాగార్జున సాగర్ జలాశయంకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున సాగర్ జలాశయం నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహాన్ని అంచనావేసుకొని మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.