25 కేజీల బంగారం ధరించి శ్రీవారిని దర్శించుకున్న బంగారుబాబులు - వీడియో వైరల్ - family 25 kg gold to tirumala video - FAMILY 25 KG GOLD TO TIRUMALA VIDEO
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-08-2024/640-480-22277232-thumbnail-16x9-tirumala.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Aug 23, 2024, 3:23 PM IST
Mumbai Family Wear 25 Kg Gold to Tirumala Video Viral : ముంబయికి చెందిన ఓ కుటుంబం భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారిలో ఇద్దరు 10 కేజీల చొప్పున స్వర్ణాన్ని ధరించగా, మరొకరు 5 కేజీల బంగారాన్ని అలంకరించుకుని శేషాచలం కొండపై అలరించారు. ఈ బంగారం ఆభరణాలు విలువ సుమారు రూ.15 కోట్లగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇంత భారీ మొత్తంలో బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి రావడంతో తోటి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిత్యం ధనరాశులతో దూగే వెంకటేశ్వరుని దగ్గరకే బంగారంతో రావడంతో ఆశ్చర్యంగా తిలకించారు. ఆలయం ఎదుట భక్తులు వారిని చూసి సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. వారికి సెల్ఫీలు అందిస్తూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వారి రక్షణ కోసం సుమారు 15 మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం మరో విశేషం. ఇలా భక్తులు ఇంత బంగారంతో తిరుమలకు రావడం ఇదే ప్రథమం.