ముదిత్ వినూత్న ఆవిష్కరణ - కృత్రిమ మేథతో కాంటాక్ట్ లెస్ హెల్త్ మానిటర్ - ముదిత్ డోజీ హెల్త్ మానిటర్
🎬 Watch Now: Feature Video


Published : Jan 25, 2024, 4:52 PM IST
Mudit Invents Contact Free Health Monitor : రయ్ రయ్ మని సాగే కార్లంటే అతనికి చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువ. అందుకే ఐఐటీ ముంబై నుంచి పట్టా పొందిన వెంటనే సొంతంగా కార్ల డిజైన్‌పై మనసు పెట్టాడు. ఆల్టైర్ టెక్నాలజీలో వెహికల్ డైనమిక్స్ ఎక్స్ పర్ట్ గా పనిచేస్తూ, దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ రేస్ కార్లు రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించారు. తనే బెంగుళూరుకి చెందిన ముదిత్ దండ్వాటే.
Contact Free Health Monitor : అనుకోని ఘటనలో తన పెంపుడు కుక్కను రక్షించబోయి చేతిని కోల్పోయినా కుంగిపోకుండా, తన ఆలోచనలతో పనిచేసే మనిషి లాంటి సొంత ఆర్టిఫీషియల్ చేయిని తయారు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం డోజీ పేరుతో ఆస్పత్రుల్లో కాంటాక్ట్ లెస్ మానిటరింగ్ పద్ధతిని అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో తాను చేపట్టబోయే ప్రాజెక్టులు, వినూత్న ఆవిష్కరణలు, భవిష్యత్ లక్ష్యం వంటి వాటిపై ముదిత్ దండ్వాటేతో మా ప్రతినిధి ముఖాముఖి.