బీఆర్ఎస్ బీజేపీతో అంతర్గతంగా పొత్తు పెట్టుకుంది - అందుకే పార్టీకి రాజీనామా చేశా : ఎంపీ వెంకటేశ్ - ఎంపీ వెంకటేశ్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Published : Feb 7, 2024, 12:28 PM IST
MP Venkatesh Comments on BRS : ఇటీవల కాంగ్రెస్లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ బీఆర్ఎస్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్ర సమితి అంతర్గతంగా బీజేపీతో ఒప్పందం పెట్టుకుందని ఆరోపించారు. ఆ పొత్తు సహించలేకే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధులపై ఏ పార్టీతో అయితే యుద్ధం చేశామో, మళ్లీ అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి నడవాలనే చర్చే రాజీనామాకు దారి తీసిందని వివరించారు.
MP Venkatesh Join Congress Reason : తాను 2019లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచినప్పటి నుంచి పెద్దపల్లి అభివృద్ధి కోసం లోక్సభలో తన గళం వినిపించానని వెంకటేశ్(MP Venkatesh) తెలిపారు. రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూర్చే అంశాలను ప్రస్తావించానని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయంలోనూ తాను పోరాడానని పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో 'బీజేపీతో పొత్తు' అనే చర్చ రావడంతో రాజీనామా చేశానని స్పష్టం చేశారు.