ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మెట్రోను 16 రాష్ట్రాలకు విస్తరించాం : ఈటల - MP Etela Rajender On Metro - MP ETELA RAJENDER ON METRO
🎬 Watch Now: Feature Video
Published : Aug 1, 2024, 12:16 PM IST
MP Etela Rajender On Metro Rail : ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టాక మెట్రోను 16 రాష్ట్రాలకు విస్తరించామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే ఆర్‌యూబీలు నిర్మించాల్సి ఉంటుందన్న ఈటల వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేనట్లు ఉందని వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో రైల్వేశాఖ పరంగా ఎన్ని సమస్యలున్నా త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై పలు విమర్శలు గుప్పించారు.
Etela On Railway Department : రైల్వేల విషయంలో ఎన్డీఏ ప్రభుత్వంలోని నరేంద్రమోదీ నాయకత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా నిధులకు కొరత లేకుండా శీఘ్రంగా పూర్తి చేసేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారన్నారు. కనుక మల్కాజిగిరిలో రైల్వే పరంగా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులు ప్రజల అవసరాలకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తామన్నారు.