స్టీల్ ప్లాంట్‌ను అమ్మే ప్రసక్తి లేదు - ఉక్కుశాఖ మంత్రిని నిధులు అడిగేందుకు నిర్ణయం: టీడీపీ నేతలు - TDP Leaders meet Steel Plant CMD
🎬 Watch Now: Feature Video
MP Bharat and MLA Palla Srinivasa Rao meeting with Steel Plant CMD: విశాఖ స్టీల్ ప్లాంట్ సక్రమంగా నిర్వహించేందుకు 3 వేల కోట్లు అవసరం అవుతుందని ప్లాంట్ అధికారులు తెలిపినట్లు ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. స్టీల్ ప్లాంట్ సీఎండీతో రెండు గంటలపాటు సమావేశమైన నాయకులు కావలసిన నిధులను సంబంధిత మంత్రిని అడిగేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. స్టీల్ ప్లాంట్‌ను సంరక్షించేందుకు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కృషి చేస్తోందని నేతలు స్పష్టం చేశారు. మిగులు భూములు అమ్మితే 1000 కోట్లు వరకు సేకరించ వచ్చని సీఎండీ చెప్పినట్టు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడేందుకు ముందు నుంచి టీడీపీ కృషి చేసిందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్లాంట్‌ను కాపాడేందుకు టీడీపీ కృషి చేస్తుందని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ఎంపీ భరత్ తెలిపారు. పేపర్లలో వచ్చిన వార్తలు అవాస్తవమని భరత్ తెలిపారు. లాభాల బాటలో స్టీల్ ప్లాంట్‌ను నడిపేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.