సిరిసిల్లలోని శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో బండి సంజయ్ ప్రత్యేక పూజలు - Markandeya Jayanti Celebrations
🎬 Watch Now: Feature Video
Published : Feb 12, 2024, 2:08 PM IST
MP Bandi Sanjay Participate in Markandeya Jayanti in Rajanna Sircilla District : రాజన్న సిరిసిల్ల పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి ఆలయాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దర్శించుకున్నారు. బండి సంజయ్కు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు, పద్మశాలి సంఘం నాయకులు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Markandeya Jayanti Celebrations in Rajanna Sircilla : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల పద్మశాలి నాయకుల ఆధ్వర్యంలో శ్రీ మార్కండేయ స్వామి ఉత్సవాలు, శోభాయాత్ర ఘనంగా నిర్వహిస్తామన్నారు. దేవాలయ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ దేవాలయానికి అయోధ్య రామ మందిరానికి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. గుడి నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఆలయం పూర్తైతే చుట్టు పక్కల ప్రాంతాల్లో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.