పీఎఫ్‌ఐ, సిమీ లాంటి తీవ్రవాద సంస్థలకు కాంగ్రెస్ కేంద్రంగా మారింది : ఎంపీ అర్వింద్ - MP Arvind Allegation on Congress - MP ARVIND ALLEGATION ON CONGRESS
🎬 Watch Now: Feature Video
Published : May 8, 2024, 4:45 PM IST
MP Arvind on Congress : తీవ్రవాద సంస్థలతో కాంగ్రెస్కు సంబంధాలున్నాయని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. నిషేధిత సంస్థ సిమీ( స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ తీర్మానం చేసిందని చెప్పారు. ముస్లింలందరూ కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని ఆ సంస్థ చేసిన తీర్మానంలో పేర్కొందని తెలిపారు. ఇవాళ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు బీజేపీకి టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయని అన్నారు.
నిషేధిత సంస్థ సిమీపై 15 టెర్రరిస్టు కేసులు ఉన్నాయని ఎంపీ అర్వింద్ వెల్లడించారు. పీఎఫ్ఐ, సిమీ లాంటి సంస్థలు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడంతో పాటు నిధులు కూడా సమకూరుస్తున్నాయని చెప్పారు. తీవ్రవాద సంస్థలకు హస్తం పార్టీ మాతృ సంస్థగా మారిందని మండిపడ్డారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఆ సంస్థలు కంట్రోల్ చేస్తాయని, అలా జరిగితే భారతదేశం అతి భయంకరంగా మారే పరిస్థితి ఉందని పేర్కొన్నారు.