మెట్రో రైలు కార్యాలయాన్ని సందర్శించిన మంగోలియా బృందం - Mongolians visited Metro Office - MONGOLIANS VISITED METRO OFFICE
🎬 Watch Now: Feature Video
Published : Apr 11, 2024, 9:17 PM IST
Mongolia Officers visited Metro Office in Hyderabad : హైదరాబాద్ మెట్రో రైలు కార్యాలయాన్ని మంగోలియా ప్రభుత్వ ప్రతినిధులు సందర్శించారు. మంగోలియా రాజధాని ఉలాన్ బాటోర్లో మెట్రో రైలు నిర్మించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగోలియా మంత్రి పురెవ్ సురెన్ నాయకత్వంలో వివిధ విభాగాలకు చెందిన 20 మంది సీనియర్ అధికారుల బృందం హైదరాబాద్ మెట్రో రైలును సందర్శించింది.
Mongolia Officers on Metro Rail Project : ఈ సందర్భంగా మెట్రో రైలు సౌకర్యాలు, అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టు అమలు చేయడంలో ఎదురైన సున్నితమైన సమస్యలు, పరిష్కారాలు, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి (NVS Reddy) మంగోలియా ప్రతినిధులకు వివరించారు. క్లిష్టమైన పరిస్థితుల్లో అతి పెద్ద ప్రాజెక్టును ఎలా అమలు చేయాలనే అంశంపై మెట్రో రైలు ఎండీ అందించిన వివరాలు తమకు ఎంతో అమూల్యంగా భావిస్తున్నట్లు మంగోలియా ప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు.