మీ ప్రాణాలు ఎంతో విలువైనవి - స్తంభాల నుంచి దిగండి - యువకులకు ప్రధాని విజ్ఞప్తి - Modi on Climb Down Electricity Pole
🎬 Watch Now: Feature Video
Published : Mar 17, 2024, 7:30 PM IST
Modi on Climb Down Electricity Pole : ఆంధ్రప్రదేశ్లోని చిలకలూరిపేటలో జరిగిన ఎన్జీయే కూటమి ప్రజాగళం సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో అభిమానులు బారికేడ్లపైకి, లైటింగ్ టవర్లపైకి ఎక్కారు. అది ప్రమాదకరం కావటంతో ప్రధాని మోదీ (Prime Minister Modi) జోక్యం చేసుకున్నారు. బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరారు. విద్యుత్ తీగల వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని వంటి పెద్ద వారు చెబుతున్నారు అర్థం చేసుకోవాలని పవన్ కూడా చెప్పటంతో, అభిమానులు విద్యుత్ టవర్లు దిగారు. అనంతరం సభ కొనసాగింది.
ఇవాళ జరిగిన బొప్పూడి ప్రజాగళం సభకు పెద్దఎత్తున జనం తరలివచ్చారు. చాలా రోజుల తర్వాత ప్రధాని మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ ఓకే వేదికపైకి రావడంతో నాయకుల్ని చూసేందుకు అభిమానులు ఉత్సాహం కనబరిచారు. మరోవైపు దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన అనంతరం ప్రధాని మోదీ పాల్గొన్న మొదటి ఎన్నికల ప్రచార బహిరంగ సభ ఇదే కావడం విశేషం.