వైభవంగా మోదకొండమ్మ జాతర మహోత్సవాలు - Modakondamma Thalli Jatara in Paderu - MODAKONDAMMA THALLI JATARA IN PADERU
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 10, 2024, 2:52 PM IST
Modakondamma Thalli Jatara in Paderu : ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాలు పాడేరులో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. నేడు ప్రత్యేక పూజలలో అమ్మవారి గుడిలో పాడేరు జిల్లా కలెక్టర్ విజయ సునీత, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహాలు తలపై పెట్టుకుని ఊరేగింపుగా మోసుకొచ్చారు. భారీ భక్తుల మధ్య అమ్మవారి ఘటాలను విగ్రహాలను గుడి నుంచి బజారులో ఉన్న శతకం పట్ట వద్దకు చేర్చారు.
జాతర పరిసరాలు బాణాసంచా, గరగ నృత్యాలు, కేరళ నృత్యాలతో ఆకట్టుకున్నారు. అమ్మవారి వేడుకల్లో మూడు రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. వివిధ సాంప్రదాయ నృత్యాలు కళలతో ఆలయ ప్రాంగణం మిరుమిట్లు గొలుపుతుంది. ప్రజలు అమ్మవారిని దర్శించుకునే క్రమంలో అంతరాయాలప కలగకుండా చర్యలు చేపట్టినట్టు ఆలయ కమిటీ పేర్కొంది.