నీటి పారుదల శాఖలో జరిగిన అవినీతిని కచ్చితంగా బయటపెడతాం : ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ - ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ కామెంట్స్
🎬 Watch Now: Feature Video
Published : Feb 19, 2024, 6:57 PM IST
MLC Mahesh Kumar Goud Fires On BRS : నీటి పారుదల శాఖలో జరిగిన అవినీతిని కచ్చితంగా బయటపెడతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్ అవినీతిని కాంగ్రెస్ బయట పెడుతుందనే నమ్మకంతోనే ప్రజలు తమకు అధికారం ఇచ్చారని తెలిపారు. మంత్రులు వారి వారి శాఖలపై సమీక్షలు నిర్వహిస్తుంటే, దిమ్మతిరిగే నిజాలు బయట పడుతున్నాయని, బీఆర్ఎస్ నేతల అవినీతి కుప్పలుగా వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో చేసిన దోపిడీపై శ్వేతపత్రం ఇస్తే దానిపై దృష్టి మరల్చేందుకు బీఆర్ఎస్ నాయకులు నీటిని సాకుగా చూపుతున్నారని విమర్శించారు.
MLC Mahesh Kumar Goud Comments On Irrigation Department : ప్రాజెక్టుల నిర్మాణంలో వ్యయాన్ని పెంచుతూ కమీషన్‌ల కోసం రూ.లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. కట్టాల్సిన చోట ప్రాజెక్ట్‌లు కట్టకుండా వ్యయాన్ని పెంచుతూ ఎంత వ్యయం పెరిగితే అంత కమీషన్ వస్తుందని రూ.30-40 వేల కోట్ల ప్రాజెక్ట్‌లను రూ.లక్ష కోట్లకు పెంచి కట్టిన ప్రాజెక్ట్‌లు ఇవాళ సరిగ్గా లేవని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.