పదేళ్లలో కేసీఆర్ రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయలేదు : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి - MLC Jeevan Comments on KCR
🎬 Watch Now: Feature Video
MLC Jeevan Comments on KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పంటలను పరిశీలించటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, ఆనాడు బాధ్యతయుతంగా పని చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేదా అని ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ సీఎంగా ఉండి పదేళ్లలో ఏనాడైనా రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయలేదని మండిపడ్డారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు.
MLC Jeevan Reddy about Farmers : రైతుల పంటలు కాపాడటానికి ప్రాజెక్టుల్లో ఉన్న చివరి బొట్టు వరకు సరఫరా చేస్తామని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారని, ఈ జూన్‌లో రైతుల అప్పులు ప్రభుత్వమే బదలాయింపు నిర్వహించి కొత్త రుణాలు వచ్చేలా చూస్తామన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు అయినా పర్యవేక్షించి నిర్మాణం చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు.