'ఎవరి కోసం ఈ విలాస భవనాలు?'- రుషికొండ రాజమహల్​ను పరిశీలించిన కూటమి నేతలు - MLA GANTA ON RUSHIKONDA Buildings - MLA GANTA ON RUSHIKONDA BUILDINGS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 16, 2024, 4:09 PM IST

Updated : Jun 16, 2024, 8:56 PM IST

MLA Ganta Srinivasa Rao on Rushikonda Constructions: విశాఖ రిషికొండపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కట్టడాలను కట్టిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి శ్రేణులతో కలిసి నిర్మాణాలను పరిశీలించిన ఆయన ఎన్జీటీ ఆదేశాలను సైతం పక్కన పెట్టారని మండిపడ్డారు. ప్రజాధనంతో జగన్ కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో కూడా తెలియడం లేదన్నారు. వైఎస్సార్సీపీ నేతల అక్రమాలతో పాటు భూ దోపిడీపై విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 

"విశాఖ రిషికొండపై జగన్ అక్రమ కట్టడాలు నిర్మించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టిన భవనాలు ఎందుకు ఉపయోగపడతాయో తెలియడం లేదు. పచ్చటి రిషికొండపై విధ్వంసం సృష్టించారు. 500 కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారు. వైఎస్సార్సీపీ నేతల అక్రమాలతో పాటు భూ దోపిడీపై విచారణ చేయాలి. త్వరలోనే సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అనంతరం దీనిపై తగు నిర్ణయం తీసుకుంటుంది." - గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే 

Last Updated : Jun 16, 2024, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.