మేడారం జాతర గురించి మంత్రులు పొన్నం, సీతక్కల ఆసక్తికర సంభాషణ - వీడియో వైరల్
🎬 Watch Now: Feature Video
Published : Feb 5, 2024, 5:28 PM IST
Ministers Ponnam and Seethakka Conversation Video Viral : వనదేవతల అనుగ్రహంతో ఎన్నో ఎండ్ల స్వరాష్ట్ర కల నెరవేరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. త్వరలో జరగనున్న మేడారం జాతరలో రవాణా సదుపాయాల కోసం హైదరాబాద్ నుంచి మేడారానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఒకే వాహనంలో ప్రయాణిస్తూ జాతర గురించి ఆసక్తిగా చర్చించుకున్నారు.
మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క సంభాషించుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎప్పుడైనా మేడారం జాతరకు వచ్చారా అని మంత్రి సీతక్క పొన్నం ప్రభాకర్‌ను ప్రశ్నించగా ఆయన అనేక ఆసక్తికరమైన అంశాలు చెప్పుకొచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, తనపై పెప్పర్ స్ప్రే దాడి, అదే సందర్భంలో జాతర అంశాలను గుర్తు చేసుకున్నారు. అంతే కాకుండా మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతో దేవాలయాల్లో రద్దీ పెరిగిందన్నారు. త్వరలో వంట గ్యాస్ సిలిండర్ పథకం కూడా మహిళలకు ఎంతో మేలు చేయనుందని పేర్కొన్నారు.