వంద రోజులు వంద పనులతో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి: మంత్రి దుర్గేష్ - Ministers Inspected in Nandyal - MINISTERS INSPECTED IN NANDYAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 14, 2024, 5:27 PM IST
Ministers Durgesh And Farooq Inspected Nandyal Cheruvu Park: రాష్ట్రాన్ని పర్యాటక హబ్‌గా చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నంద్యాలలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, కలెక్టర్ జి.రాజకుమారితో కలిసి చిన్న చెరువు పార్క్‌ను పరిశీలించారు. వంద రోజులు వంద పనులు కార్యక్రమం పేరుతో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తామని దుర్గేష్ తెలిపారు. ఒక ప్రాణిళిక ద్వారా ఈ వంద రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేస్తామన్నారు.
కేవలం మాటలకే పరిమితం కాకుండా పర్యాటకం, పుణ్య క్షేత్రాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటక హబ్‌గా చేసేందుకు కృషి చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు. జిల్లా పర్యాటక అభివృద్ధికి సహకరించాలని మంత్రి ఫరూక్ దుర్గేష్‌ను కోరారు. నిధుల కొరత ఉన్నా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధికి ప్రణాళిక రూపొందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర మంత్రులందరూ సమావేశమై నిధుల కొరత గురించి చర్చించి ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందో చెబుతామని ఆయన అన్నారు. జిల్లా పర్యాటక వివరాలు కలెక్టర్‌ను దుర్గేష్ అడిగి తెలుసుకున్నారు.