వ్యవసాయంలో ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయి : తుమ్మల - ఖమ్మంలో ఫుడ్ పార్క్ ఏర్పాట్లు
🎬 Watch Now: Feature Video
Published : Jan 29, 2024, 4:12 PM IST
Minister Tummala Nageswara Rao on Food Park in Khammam : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడులో ఫుడ్ పార్క్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao) పరిశీలించారు. ముందుగా కోల్డ్ స్టోరేజ్‌ను పరిశీలించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న పలు ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పండే అన్ని పంటలను స్టోరేజ్ చేసుకునేందుకు ఫుడ్‌పార్క్‌ను స్థాపించినట్లు తెలిపారు.
Food Park Arrangements in Khammam : ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా పండించే పంటలకు డిమాండ్ పెరుగుతుందని, రైతులు పండించే ప్రతి పంట బొగ్గపాడు ఫుడ్ పార్క్ ద్వారా ప్రాసెసింగ్ అవ్వాలని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న రైతు వేదికల్లో స్క్రీన్లు ఏర్పాటు చేసి నేరుగా అన్నదాతలు సైంటిస్టులతో మాట్లాడే విధంగా వ్యవసాయ సమస్యలపై చర్చించేలా ఏర్పాటు చేశామన్నారు. పామాయిల్ విత్తనాలను ఇతర దేశాల నుంచి తీసుకురాకుండా స్వయంగా ఖమ్మం జిల్లాలోనే విత్తనాల ప్రాసెసింగ్ ప్రారంభిస్తామని తెలియజేశారు. వ్యవసాయంలో ప్రపంచ దేశాలు మన దేశవైపు చూస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు.