నాలాలపై ఆక్రమణలు వారంతట వారే తొలగించుకోవాలి : తుమ్మల - Minister Thummala in Khammam
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2024, 5:36 PM IST
Minister Thummala in Khammam: మున్నేరు వరద సమయంలో స్వచ్ఛంద సేవా సంస్థలు తమ కార్యక్రమాలతో ప్రజలను ఆదుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశంసించారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందచేశారు. ప్రభుత్వ అధికారులతో కలిసి సేవా సంస్థలు బాధితులకు భోజనం పెట్టడం అభినందనీయమన్నారు.
కాగా వరద బాధితులకు అండగా ప్రభుత్వం 15వేలకు పైగా కుటుంబాలకు రూ.16వేల 500లను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ.25 కోట్ల నిధులను ఖమ్మం కలెక్టర్ ఖాతాలోకి విడుదల చేసింది. ఇప్పటీకే పలు ప్రైవేట్ సంస్థలు స్వఛ్చందంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేస్తునే ఉన్నారు. ఖమ్మం నగరంలో నాలాలపై కట్టడాలు నిర్మించిన వారు తమంతట తామే తొలగించుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. కాగా ఖమ్మంలో మమతా హస్పిటల్, కాలేజీలను ఓ మాజీ మంత్రి నాలాలను ఆక్రమించి నిర్మించారని పలుమార్లు రాజకీయ సభల్లో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.