'పచ్చ కామెర్లు ఉన్నవారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు - ఎంత అభివృద్ధి చేసినా ప్రతిపక్షానికి కనిపించట్లేదు' - Sridhar Babu Election Campaign - SRIDHAR BABU ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : May 11, 2024, 1:18 PM IST
Minister Sridhar Babu Election Campaign : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతియుత పాలన కొనసాగిస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన నాలుగేళ్లలో మంథని ప్రాంతంలో అనేకమందిపై దాడులు చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో అంబేడ్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో మాట్లాడిన ఆయన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్టకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన్ను గెలిపిస్తే మంథని నియోజకవర్గం అభివృద్ధికి తోడ్పడతారని అన్నారు. కొంతమంది తనను మోసం చేసినా, వెన్నుపోటు పొడిచినా దేవుణ్ని నమ్ముకొని ముందుకు వెళుతున్నారని తెలిపారు.
పచ్చ కామెర్లవారికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని, రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేసినా ఏమీ చేయలేదని విమర్శలు చేయడం వారి అవివేకమన్నారు. అవినీతి లేని రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పేదవారికి అన్యాయం జరిగితే సహించేది లేదన్న ఆయన అభివృద్ధి, సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. యువతరానికి స్ఫూర్తిగా నిలబెట్టడానికి ఏఐసీసీ వంశీ కృష్ణను ఎంపిక చేసిందని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.