వరంగల్ జిల్లాను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం - త్వరలోనే నగరానికి బహుళజాతి కంపెనీలు : మంత్రి శ్రీధర్ బాబు
🎬 Watch Now: Feature Video
Published : Feb 18, 2024, 7:53 PM IST
Minister Sridhar Babu Called Warangal District an IT Hub : వరంగల్ జిల్లాను ఐటీ పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున పరిశ్రమలతో పాటు బహుళజాతి కంపెనీలను తీసుకువస్తామని అన్నారు. హైదరాబాద్ తరహాలో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు.
Minister Sridhar Babu Visited Padmakshi Ammavari Temple : అంతకు ముందు హనుమకొండలోని పద్మాక్షి అమ్మవారిని మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, కోరిన కోరికలను తీర్చే పద్మాక్షి అమ్మవారిని ప్రతినిత్యం కుటుంబ సమేతంగా దర్శించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆలయ పూజారులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్న మంత్రి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.