మహిళా శక్తి ఓ బ్రాండ్ కావాలి : మంత్రి సీతక్క - Mahila Shakti programme - MAHILA SHAKTI PROGRAMME
🎬 Watch Now: Feature Video
Published : Jun 15, 2024, 8:25 PM IST
Minister Seethakka at Women Groups Meeting : మహిళా సంఘాలు ఆస్తులు సృష్టించే స్థాయికి ఎదిగాలని పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన మహిళా శక్తి ప్రోగ్రాంలో సీతక్క పాల్గొన్నారు. మహిళా సాధికారత కోసం చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికని గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా వివరించారు. అనంతరం మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్‌లు కుట్టిన సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.
జిల్లాల్లో మహిళా శక్తి ఫుడ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళా సంఘాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచే మార్గాలను అన్వేషించాలని మంత్రి సీతక్క సూచించారు. ప్రఖ్యాత బ్రాండ్‌ల దుస్తులు కుట్టేలా, కాంట్రాక్టులు దక్కించుకునేలా మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామస్థాయిలోనూ మహిళా సంఘాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంచే మార్గాలను అన్వేషించాలన్నారు. జిల్లాల్లో మహిళా శక్తి ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు.