వన జాతరకు ఎలాంటి సంకోచం లేకుండా ప్రజలు తరలిరావాలి : సీతక్క
🎬 Watch Now: Feature Video
Minister Seethakka Interview about Medaram Jathara : మేడారానికి భారీగా వస్తున్న భక్తులకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోందని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క తెలిపారు. రేపట్నుంచి ప్రారంభంకానున్న జన జాతరకు ఎలాంటి సంకోచం లేకుండా తరలిరావాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు. మహా జాతర ప్రారంభానికి ఇరవై రోజుల ముందు నుంచే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లును అందుబాటులోకి తెచ్చిందన్నారు. వివిధ రూట్ల నుంచి వచ్చే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకొని గతం కంటే భిన్నంగా రోడ్లను విస్తరించడమే కాకుండా, మరమ్మతులు సైతం ముందుగానే చేపట్టామన్నారు.
క్యూలైన్‌లోనూ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. అందుకోసం పోలీస్ యంత్రాంగం సైతం పెద్ద ఎత్తున పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తుందన్నారు. అదే విధంగా ఈసారి జాతర వేసవి ప్రారంభంలో రావటంతో, ఎండలకు భక్తులు సొమ్మసిల్లే పరిస్థితులు ఉన్నాయని అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు జంపన్న వాగుకు నీళ్లు కూడా విడుదల చేశామంటున్న సీతక్కతో ప్రత్యేక ముఖాముఖి.