ఓటర్లకు వైఎస్సార్సీపీ ఎర - ఉపాధ్యాయినులకు మంత్రి రోజా తాయిలాలు - Minister Roja distributed sarees
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 8, 2024, 4:32 PM IST
Minister Roja Distributed Sarees to Teachers in Puttur: రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే అధికార వైఎస్సార్సీపీ నాయకులు, వాలంటీర్లు ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీకే ఓటు వేయాలని నాయకులు వివిధ వర్గాల ఓటర్లకు తాయిలాలతో ఎర వేస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు, అభినంద సభలంటూ వివిధ వర్గాల ప్రజలను ఆహ్వానిస్తూ మహిళలకు చీరలు, బిందెలు పురుషులకు ప్యాంట్, షర్టు బాక్సులు, నిత్యావసర సరుకులు చేతిలో పెడుతున్నారు. ఇలా నాయకులు పెట్టిన సభలకు రాకపోతే పథకాలు రావంటూ ప్రజలను వాలంటీర్లతో బెదిరిస్తున్నారు.
తాజాగా తిరుపతి జిల్లాలోని పుత్తూరులో మంత్రి రోజా తన నియోజకవర్గంలోని ఉపాధ్యాయినులకు మహిళా దినోత్సవ కార్యక్రమం పేరుతో చీర, జాకెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి రాకుంటే చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు ఆదేశించడంతో గురువారం సాయంత్రం పుత్తూరు షాదీమహల్లో నిర్వహించిన సమావేశానికి ఉపాధ్యాయినులకు తప్పక హాజరుకావాల్సి వచ్చింది. ఈ సందర్భంగా మంత్రి రోజా వారికి చీరలు అందజేసి, విందు ఇచ్చారు.