కరీంనగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ - హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ - lok sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 22, 2024, 9:51 PM IST
Minister Ponnam fires on Modi : లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ పూర్తి కాగానే మోదీకి భయం పట్టుకుందని, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. అందుకే ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ది పొందేందుకు యత్నిస్తున్నట్లు ఆయన ఆరోపించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యంతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రధాని మోదీ రాజకీయ లబ్ది పొందేందుకు చేస్తున్న ప్రసంగాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆయన విమర్శించారు. పదేళ్లు పాలించిన మోదీ అదానీ, అంబానీకి తప్ప సామాన్యుడికి న్యాయం చేయలేదన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కరీంనగర్ ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. బండి సంజయ్‌పై అవినీతి, ఆరోపణలు వచ్చాయని, అందుకే రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిజమైన భక్తుడు అయితే దేవాలయాలకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. బీఅర్ఎస్ అభ్యర్థి రూ.6 కోట్లతో ఓట్లను కొనాలని చూశాడని, హోటల్‌లో దొరికిన డబ్బు బీఆర్ఎస్‌దేనని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.