దసరాకు ఈ ప్రతిజ్ఞ చేద్దాం - వాహనదారులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి - ROAD ACCIDENTS IN TELANGANA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2024, 10:35 AM IST

Minister Ponnam On Traffic Rules : ట్రాఫిక్ రూల్స్ పాటించండి, క్షేమంగా ప్రయాణించండి, ప్రాణాల్ని రక్షించండని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సగటున దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

దసరా చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ దసరాకు ఆయుధ పూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాం, హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తాం, సీటు బెల్టు పెట్టుకుంటాం అని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు. మద్యం తాగి వాహనం నడపద్దు, ఇది ప్రమాదానికి సూచిక అని హెచ్చరించారు. వినూత్నంగా మంత్రి వీడియో ద్వారా ఇచ్చిన సందేశంపై మంచి రెస్పాన్స్ వస్తుంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.