ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి పూర్వవైభవం - త్వరలోనే 3 వేల నియామకాలకు కార్యాచరణ : పొన్నం ప్రభాకర్ - Ponnam Prabhakar Karimnagar news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2024, 1:17 PM IST

Minister Ponnam Prabhakar in Karimnagar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని 43 వేల మంది ఉద్యోగులు నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తూ లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ డిపో-2లో నిర్వహించిన కరీంనగర్, ఖమ్మం రీజియన్​కు చెందిన ఉద్యోగుల కారుణ్య నియామక పత్రాల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని 45 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 

మహాలక్ష్మి పథకం ద్వారా డిసెంబర్ 9 నుంచి మహిళలందరికీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణంతో బస్సులన్నీ కళకళలాడుతున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా సమర్థవంతంగా పని చేస్తున్న కార్మికులందరినీ పొన్నం అభినందించారు. మహాలక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి ఉద్యోగులను, కొత్త రూట్ల​ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికులను సురక్షితంగా చేర వేయడానికి వెయ్యి బస్సులను కొనుగోలు చేసి, నూతనంగా 3 వేల మంది ఉద్యోగులను నియమించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.