బండి సంజయ్ కరీంనగర్‌కు చేసిందేంటో చెప్పి ఓట్లడగాలి : మంత్రి పొన్నం ప్రభాకర్ - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 10, 2024, 3:50 PM IST
Minister Ponnam Comments on Bandi Sanjay : మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రస్తుత నేత బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి ఓట్లడగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి పొన్నం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అత్యంత బలవంతుడిగా ధైర్యమిచ్చే అంజన్న ఆశీర్వాదంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని కోరుకున్నట్లు వివరించారు.
గతంలో బొందుగాళ్లు అన్న కేసీఆర్ వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని గెలిచిన బండి సంజయ్, కొండగట్టు, వేములవాడ ఆలయాలకు ఏం చేశారని మంత్రి పొన్నం ప్రశ్నించారు. రాముడి పేరుతో కాకుండా ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగితే కేసీఆర్ ఒక్కసారైనా రాలేదని ధ్వజమెత్తారు. గతంలో ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్న దగ్గర పెద్ద విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామన్నారని, మాట ఇచ్చి తప్పితే అంజన్న ఊరుకుంటారా అని ఎద్దేవా చేశారు.