ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ - ప్రతిపక్షాలకు మింగుడు పడటం లేదు : మంత్రి పొంగులేటి - Minister Ponguleti khammam Tour - MINISTER PONGULETI KHAMMAM TOUR
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-06-2024/640-480-21769427-thumbnail-16x9-ponguleti.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jun 22, 2024, 1:59 PM IST
Minister ponguleti On Crop Loan waiver : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణలో ఏర్పడింది పేదల ప్రభుత్వమన్నారు. త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, వాటి కోసం రూ.31 వేల కోట్లు అవసరం పడతాయని వివరించారు. ఈ ప్రకటన విన్న తర్వాత ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఆయన తెలిపారు. తమది పేదోడి ప్రభుత్వమన్నారు.
పేదలకు ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఇస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విద్యుత్ అధికారులు గ్రామాల్లో సక్రమంగా పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్పీ భూములు ఆక్రమణకు గురైతే అధికారులు పట్టించుకోవడం లేదని, వాటన్నిటిని బయటకు తీసి పేదోడికి అప్పజెప్పాలని సూచించారు. ఇకనైనా ప్రతిపక్షాలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయల నాగేశ్వరరావు రాష్ట్ర, మహిళా నాయకురాలు బేబీ స్వర్ణకుమారి ఎంపీపీ వైద్య రమ్య మాజీ సర్పంచ్ దండా పుల్లయ్య అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.