LIVE : కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి - Ponguleti live - PONGULETI LIVE
🎬 Watch Now: Feature Video
Published : Aug 1, 2024, 6:19 PM IST
|Updated : Aug 1, 2024, 6:42 PM IST
Minister Ponguleti Srininavs Reddy Press Meet Live : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రివర్గంలో చర్చించారు. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ ముగిసింది. దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్విహంచారు. మంత్రివర్గంలో నిర్ణయాలపై ఆయన మాట్లాడుతున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న వారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. అయితే బీపీఎల్‌ను పునర్ నిర్వచించే అవకాశం ఉంది. వార్షికాదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షన్నర వరకు ఉన్న కుటుంబాలను బీపీఎల్‌గా ఇప్పుడు పరిగణిస్తున్నారు.
Last Updated : Aug 1, 2024, 6:42 PM IST