ఉచిత చేపల పిల్లల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి - FISH DISTRIBUTION IN TELANGANA
🎬 Watch Now: Feature Video
Published : Oct 8, 2024, 3:25 PM IST
Minister Srinivasa Reddy in Khammam: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు జలాశయంలో చేప పిల్లలను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వదిలారు. కులవృత్తులను పోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘురాం రెడ్డి, రాష్ట్ర మత్స్యశాఖ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన మత్స్యకారులకు త్వరలోనే పరిహారం అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. వర్షానికి మత్స్యకారుల వలలు, తెప్పలు కొట్టుకొని పోయాయని, వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామని, చేప పిల్లలతో పాటు రొయ్య పిల్లలను కూడా త్వరలోనే ఇప్పిస్తామని తెలిపారు. ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ కల్కి చెరువులో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్థానిక అధికారులతో కలిసి చేపపిల్లలను వదిలారు.