ప్రజలు బీఆర్ఎస్ పాలనను చీల్చి చెండాడి - మాకు అధికారం కట్టబెట్టారు : మంత్రి జూపల్లి - minister jupally slams kcr - MINISTER JUPALLY SLAMS KCR
🎬 Watch Now: Feature Video
Published : Jul 26, 2024, 7:01 PM IST
Minister Jupally slams KCR : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. బీఆర్‌ఎస్ పాలనను జనాలు చీల్చి చెండాడారని, అందుకే ఓడించి ఇంట్లో కూర్చోపెట్టారని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్ర కేటాయింపుల మీద చర్చ జరిగేటప్పుడు కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. తనకంటే చిన్న వయసు వాళ్ల ముందు నేను కుర్చోవాలా? అనే సాకుతో సభకు రావడం లేదని జూపల్లి ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో 25 శాతం నిధులు కేటాయించినట్లు ఆయన తెలిపారు. కేవలం జనాలను మభ్య పెట్టడానికే కేసీఆర్ రైతుబంధు, దళితబంధు లాంటి పథకాల్ని తీసుకొచ్చారని ఆయన ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పాలన బాగోలేదనే మొన్నటి ఎన్నికల్లో తమను గెలిపించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ప్రజలను రెచ్చగొట్టడానికే కేటీఆర్ అలా మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.