మేడిగడ్డ డ్రోన్ విజువల్స్ ఎప్పుడైనా చూశారా? - ఇదిగో ఇప్పుడు చూసేయండి - medigadda barrage drone visuals - MEDIGADDA BARRAGE DRONE VISUALS
🎬 Watch Now: Feature Video
Published : Jul 26, 2024, 4:33 PM IST
Medigadda Drone Visuals : బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డను సందర్శించారు. కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్‌తో పాటు మేడిగడ్డను పరిశీలించిన బీఆర్ఎస్ నేతల బృందం, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువని అభివర్ణించారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారని పేర్కొన్నారు. తెలంగాణలో కరువు అనే మాట వినపడొద్దని ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో కరవు ప్రాంతాలకు సాగు నీరు అందుతుందన్నారు.
శాసనసభ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50 వేల మంది రైతులతో వచ్చి తామే పంప్‌హౌస్‌లు ఆన్ చేసి బీడు భూములకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ప్రజలు, రైతులను ఇబ్బందులు పెట్టొద్దన్నారు. కేవలం రాజకీయ కక్షతో, కేసీఆర్‌ను బద్నాం చేయాలనే పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు. ఈ మేరకు ప్రాజెక్టును సందర్శించిన డ్రోన్ విజువల్స్ విడుదల చేశారు. ఆ దృశ్యాలను మీరూ చూసేయండి.