ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు - లెక్కచేయకుండా దాటుతున్న వాహనదారులు - Medchal Stream is Flowing Furiously - MEDCHAL STREAM IS FLOWING FURIOUSLY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 11:39 AM IST

Medchal Stream is Flowing Furiously and Travelers Facing Problems : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కిష్టాపూర్ వెళ్లే దారిలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాహన దారులు ఇబ్బందులు పడుతూ ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్నారు. తాజాగా ఓ వాహనదారుడు అదుపు తప్పి వంతెనపై పడిపోయాడు. వాగులో పడబోతుండగా స్థానికులు అతడిని రక్షించారు. అధికారులు అక్కడ ఎలాంటి ప్రమాద సూచికలు కానీ, బారికేడ్లు కానీ ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాగు ప్రవాహంపై స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. భారీగా వస్తున్న నీటి నుంచే వాహనదారులు వెళ్లడంతో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరైతే ప్రాణ భయం లేకుండా బైక్​పై వాగును దాటితే, మరికొందరు ఏం కాదులే అన్నట్లుగా వెళ్లిపోతున్నారు. వరద తగ్గే వరకు వాహనదారులు వెళ్లకుండా పోలీసులు నియంత్రణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.