పిల్లల పార్క్ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్ - ఆందోళనకు దిగిన కమ్యునిటీ వాసులపై దౌర్జన్యం - Medchal Colony People Concern
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-03-2024/640-480-20998637-thumbnail-16x9-protest.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Mar 16, 2024, 1:25 PM IST
Medchal Residents Protest for Illegal Land Registration : మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటలో శ్రీ లక్ష్మీ శ్రీనివాస గేటెడ్ కమ్యునిటీ వాసులు ఆందోళన నిర్వహించారు. పిల్లల పార్క్ స్థలాన్ని నిర్మాణ సంస్థ ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడంతో గత రెండు రోజులుగా ఇంటి యజమానులకు, నిర్మాణ సంస్థకు వివాదం చోటు చేసుకుంది. నిర్మాణ సంస్థ సిబ్బంది కాలనీ పార్కులో ఏర్పాటు చేసిన సూచిక బోర్డును రాత్రికి రాత్రి తీసేసి పార్కులోని తాత్కాలిక నిర్మాణాలను తొలగించే ప్రయత్నం చేయడంతో ఇంటి యజమానులకు, బిల్డర్స్‌కు మరోసారి గొడవ జరగింది. మహిళలు, చిన్నపిల్లలపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో కాలనీవాసులు తమకు చట్ట పరంగా న్యాయం జరగాలని ధర్నా నిర్వహించారు.
Dundigal Colony People Protest : గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు నిర్మించిన నిర్మాణ సంస్థ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, పాఠశాల కోసం కొంత స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. నగర శివారు ప్రాంతాల్లో భూముల ధరలు పెరగడంతో మల్లంపేటలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస నిర్మాణ సంస్థ ప్రజాప్రయోజన స్థలంపై కన్నేసింది. 1200 గజాల స్థలాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసింది. దీంతో పార్క్ స్థలంలో ఏర్పాటు చేసిన పరికరాలను తొలగించే ప్రయత్నం చేయడంతో కాలనీవాసులు అడ్డుకున్నారు.