విద్యుత్ దీప కాంతుల్లో మేడారం - కనువిందుగా డ్రోన్ దృశ్యాలు - విద్యుత్ దీప కాంతుల్లో మేడారం
🎬 Watch Now: Feature Video
Published : Feb 24, 2024, 11:00 PM IST
Medaram Night Drone Visuals : వనదేవతల వన ప్రవేశం జరిగినా భక్తుల సందడి తగ్గలేదు. రాత్రి వేళ మేడారం పరిసరాలు విద్యుత్ దీప కాంతుల్లో వెలిగిపోతున్నాయి. జాతర ప్రాంతానికి సంబంధించిన డ్రోన్ కెమెరా దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. మేడారం జాతర ఈరోజు చివరి రోజు కావడంతో సమ్మక్క సారలమ్మల జాతర వనదేవతల దర్శనానికి వచ్చిన లక్షలాది మంది భక్తులతో మేడారం పరిసరాలు కిక్కిరిసిపోయి జనసంద్రంగా మారాయి.
Night Drone Visuals in Medaram jatara : జాతరకు వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించి గద్దెల చెంతకు చేరి వనదేవతలను దర్శించుకుని తమ మొక్కులను మనసారా చెల్లించుకుంటున్నారు. నాలుగు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన గిరిజన జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి దాదాపు కోటిన్నర మంది తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. మేడారంలో రాత్రి విద్యుత్ దీపాల వెలుగుల తో పరిసర ప్రాంతాలు ఆకర్షణగా మారాయి. జంపన్న వాగు, గద్దెల ప్రాంగణం, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు విద్యుత్ దీపాల వెలుగులు డ్రోన్ కెమెరా దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.