వేసవిలో అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం : డీఎఫ్‌వో - FIRE OFFICER SRINIVAS INTERVIEW - FIRE OFFICER SRINIVAS INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Mar 31, 2024, 6:30 PM IST
Fire Officer Interview : ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వేడిగాలులు, ఎండ తీవ్రతతో పగటి పూట జన సంచారం కూడా తగ్గిపోయింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్‌చెరు నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో రసాయనిక పరిశ్రమలున్నాయి. అనుకోని పరిస్థితుల్లో అగ్నిప్రమాదం జరిగితే భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో వేసవి కాలంలో జరిగే అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జనవరి నెల నుంచే సిబ్బంది సిద్ధంగా ఉంది. జిల్లాలో మొత్తం 6 అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. ప్రతి కేంద్రంలో ఐదుగురు అగ్నిమాపక అధికారులు ఉన్నారు. ఇప్పటికే సిబ్బందికి అత్యవసరమైతే తప్ప సెలవులు కూడా రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు అగ్నిప్రమాదాల నివారణకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది అగ్నిమాపక శాఖ. ఈ వేసవిలో వీలైనంత వరకు అగ్నిప్రమాదాలు జరగకుండా ప్రజలతో పాటు, పరిశ్రమల యాజమాన్యానికీ అవగాహన కల్పిస్తున్నామంటున్న సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..