హుజూరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం - కాలి బూడిదైన 35 దుకాణాలు - Massive Fire Accident In Karimnagar - MASSIVE FIRE ACCIDENT IN KARIMNAGAR
🎬 Watch Now: Feature Video
Published : Jul 16, 2024, 9:02 AM IST
Massive Fire Accident In Karimnagar : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పట్టణ ప్రధాన రహదారి పక్కన అంబేడ్కర్ కూడలి సమీపంలో దుకాణాల్లో మంటలు చెలరేగాయి. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే భారీగా మంటలు వ్యాపించి సుమారు 35 దుకాణాలకు అంటుకున్నాయి. దుకాణ యాజమానులు, కుటుంబీకులు అక్కడికి చేరుకుని బకెట్లతో నీళ్లు తీసుకొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐ సాంబయ్య సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు సుమారు రెండు గంటల పాటు శ్రమించారు. మంటలకు పలు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు వ్యాపారులు అంచనా వేస్తున్నారు. తమ జీవనాధారం కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అగ్నిమాపక వాహనాలు ఆలస్యంగా రావటం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.