LIVE : కర్ణాటకలో మార్గదర్శి చిట్‌ఫండ్ 119వ శాఖ ప్రారంభోత్సవం
🎬 Watch Now: Feature Video
Published : 6 hours ago
|Updated : 5 hours ago
Margadarsi New Branch Opening Today Live : చిట్ ఫండ్ పరిశ్రమలో నమ్మకమైన, అగ్రగామిగా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మరో రెండు శాఖలను ప్రారంభిస్తున్నారు. ఇవాళ బెంగళూరులోని కెంగేరిలో 119వ శాఖను మార్గదర్శి చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ప్రారంభిస్తున్నారు. అనంతరం ఉద్యోగులను, చందాదారులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అలాగే తమిళనాడులోని హోసూర్‌లో 120వ శాఖను సాయంత్రం ప్రారంభించనున్నారు. అత్యంత విశ్వసనీయమైన, కస్టమర్ ఫ్రెండ్లీ మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉంది. 1962లో ప్రారంభమైనప్పటి నుంచి మార్గదర్శి చిట్ ఫండ్ నమ్మకం, విశ్వసనీయతను కొనసాగిస్తోంది. 60 లక్షల మంది వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందిస్తోంది. రూ. 9 వేల 396 కోట్ల టర్నోవర్. కంపెనీ విలువలు, ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతపై ఆధారపడి మార్గదర్శి పని చేస్తోంది. బెంగళూరు, తమిళనాడులోని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నూతన శాఖ ప్రారంభోత్సవాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా చూద్దాం.
Last Updated : 5 hours ago