మాణిక్యరావును కాపాడేదెవరు?- డీజీపీ ఆదేశాలతో ఎట్టకేలకు జీరో ఎఫ్ఐఆర్ - Manikya Rao Complaint - MANIKYA RAO COMPLAINT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-05-2024/640-480-21567255-thumbnail-16x9-manikya-rao-complaint.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 27, 2024, 10:02 AM IST
Mangalagiri Police Accept Manikya Rao Complaint: ఎన్నో నాటకీయ పరిణామాల తరువాత పిన్నెల్లి సోదరుల బాధితుడు మాణిక్యరావు ఫిర్యాదును మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వీకరించారు. డీజీపీ ఆదేశాల మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని టీడీపీ కార్యకర్త, పోలింగ్ రోజు కండ్లకుంటలో ఏజెంటుగా వ్యవహరించిన నోముల మాణిక్యరావు ఆందోళన వ్యక్తం చేశారు. తనను చంపడానికి కండ్లకుంటకు చెందిన బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, పిన్నెల్లి వెంకటరెడ్డి, పిన్నెల్లి వెంకట లక్ష్మారెడ్డి, మోదుగుల వెంకటరెడ్డిని వారు నియమించారని వాపోయారు.
ప్రస్తుత పరిస్థితిలో తాను మాచర్ల వెళ్లే పరిస్థితి లేదని, తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ మేరకు డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాకు టీడీపీ నేత వర్ల రామయ్య, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంగళగిరి గ్రామీణ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెనకాడుతున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత డీజీపీ గుంటూరు ఎస్పీకి, ఆయన స్థానిక పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్‌ను వెల్దుర్తి ఠాణాకి పంపిస్తామని ఎస్ఐ చెప్పారు.