LIVE : మీడియాతో మాట్లాడుతున్న మంచు మనోజ్
🎬 Watch Now: Feature Video
Published : 3 hours ago
|Updated : 1 hours ago
Manchu Manoj Live : మంచు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లు ముగ్గురూ బుధవారం ఉదయం 10.30 గంటలకు తనముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరవ్వాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశించారు. ఈ మేరకు ముగ్గురికి వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విచారణకు వెళ్తున్న మంచు మనోజ్ మీడియాపై దాడిని ఖండించారు. తాను ఇంటి వాళ్ల మీద ఆదాయం మీద ఆధారపడలేదని వెల్లడించారు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నామని చెప్పారు. ఆస్తుల కోసం తన నాన్నతో గొడవపడుతున్నాననేది వాస్తవం కాదని స్పష్టం చేశారు. ఇవాళ పోలీసుల విచారణకు హాజరవుతానని తెలిపారు. తాను ఎవరిపై దాడి చేశానో సీసీ కెమెరా దృశ్యాలు చూపించండని ఉద్ఘాటించారు. పోలీసుల విచారణ తర్వాత మిగతా విషయాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. నిన్న తన నాన్న దాడిలో గాయపడిన జర్నలిస్టుకు తాను క్షమాపణలు చెప్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్ శివారు జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసంలోకి జరిగిన ఘటనపై పోలీసులు విచారించనున్నారు. కొద్దిసేపటి వరకు అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్న పరిస్థితులపై ఆరా తీయనున్నారు.
Last Updated : 1 hours ago