సిద్దిపేట యువకుడి వినూత్న ఆవిష్కరణ - ఇకపై పొలంలోనే బియ్యం ఉత్పత్తి! - a Man Makes Harvester Mission

By ETV Bharat Telangana Team

Published : Apr 4, 2024, 1:18 PM IST

thumbnail

Man Makes Harvester Mission In Siddipet : రైతులకు పని భారం తగ్గించాలి అని నిర్ణయించుకున్నాడు ఓ యువకుడు. చదివింది పదో తరగతే అయినా అసాధారణ ప్రతిభతో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. అచ్చం హార్వెస్టర్‌ లాంటి యంత్రాన్ని తయారు చేసి పొలంలోనే బియ్యం ఉత్పత్తి చేస్తున్నాడు. రైతులకు అండగా నేనున్నానంటున్నాడు. వినడానికి కొంచెం విభిన్నంగా ఉన్నా, అతడి ఆవిష్కరణ ప్రత్యేకత అది. దాన్ని ప్రయోగాత్మకంగా చేసి సక్సెస్‌ కూడా అయ్యాడు సిద్దిపేట జిల్లాకు చెందిన అమరేందర్‌. 

ఆర్థిక ఇబ్బందుల వల్ల పూర్తి స్తాయిలో పని చేసే యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురాలేకపోయానని ఆ యువకుడు చెబుతున్నాడు. ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం అందిస్తే, ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తానని చెబుతున్నాడు. ఈ మిషన్​తో కూలీ కొరతతో పాటు, పంట నష్టాన్ని కూడా తగ్గించవచ్చని చెబుతున్నాడు అమరేందర్‌. మరి ఇంత చిన్న వయసులో ఆ ఆలోచన అతడికెలా వచ్చింది. ప్రభుత్వం సహకరిస్తే రైతులకు ఉపయోగపడే మరింత టెక్నాలజీ తీసుకొస్తానని చెప్తున్న అమరేందర్‌తో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి..

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.