రూ.15 లక్షల వరకు లడ్డూ వేలంలో పాల్గొని - ఆపై తీన్మార్ స్టెప్పులేసి - అంతలోనే! - Ganesh immersion in Manikonda - GANESH IMMERSION IN MANIKONDA
🎬 Watch Now: Feature Video
Published : Sep 16, 2024, 1:17 PM IST
Software Employee Died of Heart Attack : హైదరాబాద్ నగర శివారు మణికొండలోని అల్కాపురీ కాలనీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అల్కాపురీ టౌన్‌షిప్‌లోని గణేశ్ ఉత్సవ కమిటీ లడ్డు వేలం పాటలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందాడు. రూ.15 లక్షల వరకు లడ్డూ వేలం పాట పాడాడు. రూ.16 లక్షలకు అదే టౌన్‌షిప్‌లోని మిత్రుడు సురేశ్ ఆ లడ్డూ కైవసం చేసుకున్నాడు. ఆ ఆనంద క్షణాన సురేశ్‌తో కలిసి కాసేపు స్టెప్పులేశాడు. అనంతరం అక్కడి నుంచి ఇంటికెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. కుటుంబసభ్యులు గమనించి సీపీఆర్ చేసినా, ఫలించలేదు. చూస్తుండగానే శ్యామ్ ప్రసాద్ మరణించాడు.
అప్పటి వరకు గణేశుడి వద్ద లడ్డూ వేలంలో పాల్గొని, నృత్యాలు చేస్తూ ఆనందంగా గడిపిన శ్యామ్ ప్రసాద్, గుండె పోటుతో మృతి చెందడం పట్ల కాలనీ వాసులు విస్మయానికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.