మెడికల్ షాపులో బిల్లింగ్ చేస్తూ కుప్పకూలిన వ్యక్తి - వీడియో వైరల్ - MAN DIED OF HEARTATTACK VIDEO - MAN DIED OF HEARTATTACK VIDEO
🎬 Watch Now: Feature Video
Published : Jun 6, 2024, 1:21 PM IST
Man Collapsed Due to Heart Stroke In Hyderabad Video : హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన గ్రేటర్ హైదరాబాద్లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర గ్రామంలో చోటుచేసుకుంది.. ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో ఉన్న సత్యనారాయణ కాలనీలోని ఓ ఫార్మసీ మెడికల్ స్టోర్లో మురళి అనే వ్యక్తి పని చేస్తున్నారు. కౌంటర్లో కూర్చుని వచ్చినవారికి మందులు ఇస్తున్నారు.
అలా కస్టమర్ల మందులకు బిల్లింగ్ చేస్తున్న మురళి ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే అక్కడ ఉన్న మరోవ్యక్తి స్పందించి ఫిట్స్ వచ్చిందేమోనని తాళాలు అతని చేతిలో పెట్టాడు. అయినా ఎలాంటి చలనం లేదు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అతడు గుండెపోటుతో అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మురళి వృత్తిరీత్యా ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఆ తర్వాత టీచర్ వృత్తిని వదిలేసి మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఇలా హఠాత్తుగా మరణించడంతో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.