ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు నేను సిద్ధం - నిర్ణయం అధిష్ఠానానిదే - Mallu Nandini Political news
🎬 Watch Now: Feature Video


Published : Feb 3, 2024, 1:47 PM IST
Mallu Nandini Contesting From Khammam Parliament : ఖమ్మం పార్లమెంటు స్థానం కోరుతూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని గాంధీ భవన్‌కు ర్యాలీగా బయలుదేరారు. గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఆమె కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు బయలు దేరారు. ఆమె ఖమ్మం నుంచి బరిలోకి దిగడానికి సిద్దమయ్యారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఆసక్తి చూపడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని లేకుంటే, తానే బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు.
Mallu Nandini Contest From Khammam MP : ఖమ్మం పార్లమెంటు స్థానంలో మల్లు నందిని దరఖాస్తు చేసుకునేందుకు సిద్దమయ్యారు. ముందుగా స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు చేసి హైదరాబాద్ వెళ్లారు. ఒకవేళ సోనియా గాంధీ, ప్రియాంక పోటీ చేసినా, లేక అధిష్టానం ఎవరికి అవకాశం ఇచ్చినా కలిసి పని చేస్తామని మల్లు భట్టి విక్రమార్క సతీమణి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయడమే అందరి లక్ష్యమని నందిని స్పష్టం చేశారు.