అన్నా నువ్వే గెలుస్తావ్ - ఈటలతో మల్లారెడ్డి సరదా మాటలు - Malla Reddy Meets Etela Rajender - MALLA REDDY MEETS ETELA RAJENDER
🎬 Watch Now: Feature Video
Published : Apr 26, 2024, 4:40 PM IST
Malla Reddy Meets Etela Rajender Viral Video : మాజీ మంత్రి మల్లారెడ్డి ఏం చేసిన రాష్ట్రంలో వైరల్‌గా మారిపోతుంది. ఓ వేడుకకు వెళ్లిన ఆయన మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రేజేందర్‌ను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారుతోంది.
Malla Reddy Meets Etela Rajender Photos : మేడ్చల్ మల్గాజిగిరి జిల్లాలోని మేడ్చల్ మండలం కండ్లకోయలోని ఓ వేడుకకు మల్లారెడ్డి వెళ్లారు. అక్కడ ఉన్న ఈటల రాజేందర్‌ను కలిశారు. అనంతరం ఆయనను ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. అనంతరం సరదాగా మల్లారెడ్డి, ఈటలతో నువ్వే గెలుస్తావని ఛలోక్తి విసిరారు. వీరందరూ ఒకేచోటే కనిపించే సరికి కార్యక్రమానికి వచ్చిన వారంతా ఆసక్తిగా గమనించారు. నాయకులందరూ కలిసి గ్రూపు ఫొటోలు దిగారు. ఈటల రాజేందర్ ఈసారి మల్కాజ్‌గిరీ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచారు.